Aug 10,2022 22:07

ఘనంగా యుటిఎఫ్‌ ఆవిర్భావ వేడుకలు
ప్రజాశక్తి- పుంగనూరు:
యుటిఎఫ్‌ 49వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పుంగనూరులో ఘనంగా నిర్వహించారు. స్థానిక విద్యాశాఖ కార్యాలయం వద్ద యుటిఎఫ్‌ నాయకులు ఆధ్వర్యంలో బుధవారం ఆవిర్భావ దినోత్సవం వేడుకలు నిర్వహించి సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా యుటిఎఫ్‌ ప్రధానకార్యదర్శి శంకర్‌ రెడ్డి మాట్లాడుతూ 1974 ఆగస్టు10న అతికొద్ది మందితో యుటిఎఫ్‌ సంఘం ఆవిర్భావమైందన్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో యుటిఎఫ్‌ ఒక బలమైన, సామాజిక స్పహ కలిగిన, 10 మంది మేధావులైన ఎమ్మెల్సీను కలిగిన సంఘగా ఉందని, విద్యారంగా పరిరక్షణకు బస్సుయాత్ర చేస్తూ ప్రభుత్వ పాఠశాలలు బలోపేతానికి నిరంతరం కషి చేస్తున్న ఏకైక సంఘం యుటిఎఫ్‌ అని అన్నారు. ఈ వేడుకల సందర్భంగా జిల్లా కార్యదర్శి జగన్మోహనరెడ్డి, జిల్లా ఆడిట్‌ కమిటీ సభ్యులు వెంకటేశ్వరరెడ్డి సమక్షంలో రెడ్డెప్ప యుటిఎఫ్‌లో చేరారు. అనంతరం రెడ్డెప్పను శాలువతో ఘనంగా సత్కరించారు. ఈకార్యక్రమంలో నాయకులు అంజప్ప, చంద్రశేఖరరెడ్డి, సురేంద్రరెడ్డి, కష్ణంరాజు, రెడ్డెప్ప, సుబ్రమణ్యంరెడ్డి, లోకనాథరెడ్డి, శ్రీనివాసులు, రామచంద్ర, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
వెదురుకుప్పం: మండలంలోని పచ్చికాపల్లం మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో మండల అధ్యక్షులు జి.దేశయ్య ఆధ్వర్యంలో బుధవారం యుటిఎఫ్‌ 49వ ఆవిర్భావ దినోత్సవం మండల ఉపాధ్యాయులు జెండాను ఎగురవేసి వందనం సమర్పించారు. కార్యక్రమంలో జిల్లాకార్యవర్గ సభ్యుడు పీతాంబరరెడ్డి, ఎం.లోకనాథం, ఎంవి.రామకష్ణ, జిల్లా సిపిఎస్‌ కో కన్వీనర్‌ పి.లోకనాథం, ఎం.గుణ పాల్గొన్నారు.
పలమనేరు: యుటిఎఫ్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యుటిఎఫ్‌ సీనియర్‌ నాయకులు ఎన్‌.సోమచంద్రారెడ్డి పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పి. సుధాకర్‌రెడ్డి, నాగభూషణం, గురుమూర్తి, ప్రసన్న కుమార్‌, కృష్ణమూర్తి, ప్రకాష్‌, భాస్కరయ్య, బాబు, రామ్మోహన్‌, వేమచంద్రారెడ్డి, భాస్కర్‌, హరికృష్ణ, హరి నారాయణ, ధనశేఖర్‌, షణ్ముగం పాల్గొన్నారు.