ప్రజాశక్తి -పొదలకూరు :పొదలకూరు మండలం, లింగంపల్లి గ్రామానికి చెందిన డేగా యశ్వంత్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా ఆదివారం జరుపుకున్నారు. ఆయన తాత పొదలకూరు సమితి ప్రెసిడెంట్‌గా డేగా పిచ్చిరెడ్డి పనిచేశారు. తండ్రి డేగా భక్తవత్సల్ రెడ్డి పొదలకూరు మేజర్ పంచాయతీలో చురుగ్గా రాజకీయాల్లో ఉండేవారు. దీంతో యశ్వంత్ రెడ్డి కి చిన్నప్పటి నుండి రాజకీయాలంటే ఎక్కువ మక్కువ కలిగింది. ఆయన అభిమాన నాయకులు, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. యశ్వంత్ రెడ్డి ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. తాత వారసత్వాన్ని అందిపుచ్చుకున్న యువ నాయకుడు యశ్వంత్ రెడ్డి పేదలకు తన వంతు సాయం చేయాలన్న ఆకాంక్షతో రాజకీయాల్లోకి వస్తున్నారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా పట్టణంలోని నరసారెడ్డి కాలనీలో వున్న అనాధాశ్రమం లో వద్ధులకు అన్నదానం, పండ్లు, బ్రెడ్లు పంపీణీ చేశారు. హ్యాపీ బర్తడే యంగ్ లీడర్ అంటూ అందరూ శుభాకాంక్షలు తెలిపారు. బోగోలు భాస్కర్‌రెడ్డి, షేక్ జమీర్, యశ్వంత్, కొంగి గణేష్, ఆశీర్వాదం, బద్రి, వెంకటేష్, రాధయ్య, పెం చలయ్య, స్వామి, శ్రీను, సురేంద్ర, సాంబయ్య, మనోహర్, సుల్తాన్, జహీర్ ఉన్నారు.










