పూజలు చేస్తున్న దృశ్యం
ఘనంగా విజయదశమి వేడుకలు
ప్రజాశక్తి -నెల్లూరు :జిల్లా పోలీసు కార్యాలయంలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదట క్యాంప్ కార్యాలయం, ఎస్ బి, అనంతరం పురాతన, నూతన జిల్లా పోలీసు కార్యాలయం, తదుపరి మోటార్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయం నందు
యస్.పి. డాక్టర్ .కె. తిరుమలేశ్వర రెడ్డి కుటుంబ సమేతంగా ఆయుధపూజ నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీసు ఆయుధాలకు, పోలీసు వాహ నాలకు ఘనంగా పూజలు చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ఆయుధ పూజ పురా తన కాలం నుండి అనాథిగా ఆచరిస్తున్న కార్యక్ర మాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజయ దశమి రోజున చెడుపై విజయానికి నాందిగా పూజా కార్య క్రమాలు నిర్వహించుకుంటామన్నారు. ప్రతి ఒక్క రూ వారి యొక్క కుటుంబ సభ్యులతో కలిసి సుఖ సంతోషాలతో పండుగను జరుపుకోవాలని ఆకాంక్షి స్తూ, ప్రజలు, పోలీసు అధికారులు, సిబ్బంది అంద రికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఘ నంగా పూజలను నిర్వహించి, పోలీసు సిబ్బంది, అధికారులందరికీ తీర్ద ప్రసాదాలు అందజేశారు. సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ జిల్లా పోలీసు కార్యాలయంలోనే విజయ దశమి రోజున క్యాంటిన్ ను ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా దసరా ఉత్సవాలు జరిగే దేవాలయాలు, నవరాత్రి ఉత్సవాలు జరిగే అమ్మవారి ఆలయాలు, ప్రదేశాల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేవాలయాలకు దర్శనం నిమిత్తం వచ్చే భక్తులు ప్రతి ఒక్కరూ తప్పకుండా పోలీసు వారికి సహకరించాలని సూచనలు చేశారు.










