
ప్రజాశక్తి-అనకాపల్లి
తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు జన్మదిన వేడుకలు స్థానిక పెంటకోట కన్వెన్షన్ హాల్లో బుధవారం అట్టహాసంగా నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా టిడిపి శ్రేణులు తరలివచ్చి నాగ జగదీష్‌కు పూలదండలు పుష్పగుచ్ఛాలు, దుస్సాలువాలతో సత్కరించారు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారీ కేకును కట్ చేసి పంపిణీ చేశారు. ఇందులో పాల్గొన్న మాజీ మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా తన కెరీర్‌ను ప్రారంభించిన నాగ జగదీష్ అంకితభావంతో పనిచేసి అంచలంచెలుగా ఎదిగారని తెలిపారు. టిడిపి జాతీయ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు పీలా గోవింద సత్యనారాయణ, పెతకంశెట్టి గణబాబు, గవిరెడ్డి రామానాయుడు, లీడర్ పత్రిక సంపాదకుడు వివి రమణమూర్తి, ఎమ్మెల్సీ వర్మ, పార్టీ నాయకులు ప్రగడ నాగేశ్వరరావు, పివిజి కుమార్, పైలా ప్రసాద్‌రావు, లాలం కాశి నాయుడు, బొలిశెట్టి శ్రీనివాసరావు, బ్రహ్మనాయుడు, పూతి కోటేశ్వరరావు, డాక్టర్ కేకేవి నారాయణరావు, కొణతాల వెంకట్రావు మల్ల సురేంద్ర, బిఎస్‌ఎంకే జోగి నాయుడు, నడిపల్లి గణేష్, కాయల మురళి, కర్రి బాబి, కొణతాల శ్రీనివాసరావు, నడింపల్లి శ్రీహరిరాజు, పెంటకోట రాము, సబ్బవరపు గణేష్, మల్ల నర్సింగరావు, కోలపర్తి కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.
సేవా కార్యక్రమాలు
నాగ జగదీష్ జన్మదినం సందర్భంగా పట్టణ బాలకృష్ణ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు పోలిమేర నాయుడు, దూలం ప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీపరమేశ్వరి పార్క్ జంక్షన్లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద పేదలకు టిడిపి పట్టణ అధ్యక్షులు డాక్టర్ కెకెవిఎ.నారాయణరావు చేతుల మీదుగా దుప్పట్లు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ ఏరియా ఆసుపత్రిలో గర్భిణులు, రోగులకు రొట్టెలు, పళ్ళు పంపిణీ చేశారు.