
ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
ప్రజాశక్తి - ఆత్మకూర్
ఆత్మకూరు పట్టణంలోని పద్మావతి హైస్కూల్‌లో 2000-2001 సంవత్సరం పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల అత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. ఇక్కడ విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు వివిధ స్థాయిలో ఉన్నవారు అందరూ హాజరయ్యారు. పూర్వ విద్యార్థులు నాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. పాఠశాల డైరెక్టర్ పి.ఆశ ఆధ్వర్యంలో పూర్వపు విద్యార్థులు నాటి ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని ఆమె ప్రారంభించారు. పూర్వ విద్యార్థులు తమకు విద్యను బోధించిన నాటి ఉపాధ్యాయులు రామారావు, నాగేశ్వరరావు, రవీంద్రనాథ్, మధుర, లక్ష్మీకాంతరెడ్డి, కొత్తపల్లి మండల ఎంఇఒ ఇనాయతుల్లాను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లా డుతూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం పూర్వ విద్యార్థులు కలుసుకొని తమకు విద్యను బోధించిన ఉపాధ్యాయులకు సన్మానించడంతోపాటు పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. 2001 తమ పూర్వపు విద్యార్థులను కలుసుకునే విధంగా కృషి చేసిన పాఠశాల డైరెక్టర్ ఆశాకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.