May 05,2023 22:13

పిస్తాహౌస్‌లో రుచులు చూస్తున్న డిప్యూటీ సిఎం అంజాద్‌బాషా, మంత్రి రోజా, సినీనటుడు అలీ, తదితరులు

        ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌ నగరంలోని రుద్రంపేట బైపాస్‌ బెంగళూరు జాతీయ రహదారి వద్ధ ఏర్పాటు చేసిన పిస్తా హౌస్‌ను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా, పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కె.రోజా, సినీనటుడు, రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహా దారులు అలీ ముఖ్య అతిథులుగా ప్రారంభించారు. ఈ సందర్భ ంగా ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా మాట్లాడుతూ జిల్లావాసులకు పిస్తా హౌస్‌ రుచులు అందించడం అభినందనీయం అన్నారు.
ఆకట్టుకున్న ఆర్‌కెస్టా
పిస్తా హౌస్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఆర్‌కెస్టా ఆకట్టుకుంది. హిందీ, తెలుగు సినిమా పాటలు ఆలపిస్తూ ఆహ్వానితులను ఆకట్టుకున్నారు. పిస్తా హౌస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్లు హర్షద్‌బాషా, సాహిద్‌ ఇమ్రాన్‌, హరినాథ్‌రెడ్డి, రాహుల్‌రెడ్డి, ఆసీఫ్‌ బాషా, పిస్తా హౌస్‌ ఛైర్మన్‌ మొహద్‌ అబ్దుల్‌ అజీద్‌లు అతిథులకు పుష్పగుచ్చాలు అందజేసి ఘనస్వాగతం పలికారు. వచ్చిన అనంత ప్రముఖులు, రాజకీయ పార్టీల నేతలు, అధికారులు, ప్రజలకు రెస్టా రెంట్‌ రుచులు తినిపించి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనంత వెంకటరా మిరెడ్డి, జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ గిరిజమ్మ, మేయర్‌ వసీం, డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్‌రెడ్డి, స్రవంతి వాసంతి, రాష్ట్ర ఉర్ధూ అకాడమీ ఛైర్మన్‌ నదీం తదితరులు పాల్గొన్నారు.