Aug 02,2023 22:06

పింగళి వెంకయ్యకు నివాళి అర్పిస్తున్న గ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్సన్‌ తదితరులు

         అనంతపురం కలెక్టరేట్‌ : స్వాతంత్య్ర సమరయోధుడు, జియాలజిస్ట్‌ పింగళి వెంకయ్య జయంతిని పురష్కరించుకుని జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. బుధవారం జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యాలయంలో పింగళి వెంకయ్య చిత్రపటానికి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్సన్‌ ఎల్‌ఎం.ఉమామోహన్‌రెడ్డి, కార్యదర్శి పి.రమా, మాజీ ఛైర్మన్‌ మోహన్‌రెడ్డి తదితరులు హాజరై పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లైబ్రేరియన్‌ వి.సుబ్బరత్నమ్మ, సిబ్బంది ఇంతియాజ్‌ అహమ్మద్‌, కావేరి, బాషా, ఇందిర తదితరులు పాల్గొన్నారు.