May 02,2023 09:45

అనంతపురంలో జెండాను ఎగురవేస్తున్న సిపిఎం, సిఐటియు నాయకులు

          అనంతపురం కలెక్టరేట్‌ : సమస్యల పరిష్కారానికి పోరాటమే మార్గమని కార్మికులు నినదించారు. మేడే సందర్భంగా సోమవారం నాడు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ సిపిఎం, సిఐటియు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జెండాలను ఎగురవేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలని నినదించారు. సిపిఎం ఆధ్వర్యంలో నగరంలో మేడే దినోత్సవాన్ని నిర్వహించారు. 26 కేంద్రాల్లో మేడే నిర్వహించి జెండాలు ఎగుర వేశారు. రంగస్వామి నగర్‌, పెద్ద ముసలమ్మ కాలనీ, శ్రీశ్రీ నగర్‌, నవయుగ కాలనీ, మహదేవ నగర్‌, గణేనాయక్‌ కాలనీ, లీలీ సుందరయ్య కాలనీ, ఇందిరానగర్‌, అరుణోదయ కాలనీ, నీలిమా సర్కిల్‌, టిటిడి కళ్యాణమండపం, సిపిఎం కాలనీలు, హెచ్‌ఎల్‌సి కెనాల్‌ స్థూపం, ప్రియాంక నగర్‌, పాతూరు, ప్రజా చైతన్య కాలనీ, జ్యోతిబసు కాలనీ, ఆటోకాలనీల్లో సిఐటియు జెండాలు ఎగుర వేసి మేడే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర 1వ కమిటీ కార్యదర్శి వి.రామిరెడ్డి, నగర కమిటి నాయకులు ముస్కిన్‌, వలి, ప్రకాష్‌, మసూద్‌, బాబు, వెంకటేష్‌, జీవా, గపూర్‌, ప్రసాద్‌, ఇస్మాయిల్‌, రఫీ, ఫకృ, రాజు, నూరుల్లా, ఎన్టీఆర్‌ శీనా, తపోవనం రాజు పాల్గొన్నారు.
సిఐటియు ఆధ్వర్యంలో
సిఐటియు ఆధ్వర్యంలో మేడే ఘనంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 31 మండలాలు, 6 మున్సిపాలిటీల్లో 200 కేంద్రాల్లో మేడే నిర్వహించారు. అనంతపురం నగరంలో మున్సిపల్‌ కార్యాలయం ఎదుట, రైల్వే గూడ్స్‌షెడ్‌ ప్రసన్నాయ పల్లి, సివిల్‌ సప్లరు హామాలీ యూనియన్‌, తాడిపత్రి బస్టాండ్‌ సిటి హామాలీలు, భగత్‌సింగ్‌ ఆటో యూనియన్‌ ఆధ్వర్యంలో సిఐటియు జెండాలు ఎగుర వేశారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.నాగేంద్రకుమార్‌ హాజరై జెండాను ఆవిష్కరించారు. మేడే వేడుకల్లో 3 వేల మంది కార్మికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో సిఐటియు నగర కార్యదర్శులు ముర్తుజా, వెంకటనారాయణ, బాబు, గూడ్స్‌షెడ్‌ హామాలీ యూనియన్‌ నాయకులు సులేమాన్‌, మసూద్‌, సుధాకర్‌, సిటి హామాలీ యూనియన్‌ నాయకులు రఫీ, రాజన్న, ఆదినారాయణ, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.