Mar 13,2022 22:15

ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్లను అందిస్తున్న దృశ్యం


ప్రజాశక్తి-తిరుపతి(మంగళం):
జీవకోన సత్యనారాయణపురం శ్రీవారి క్లినికల్‌ ల్యాబ్‌ అధినేత వినరు కుమార్‌ ఆధ్వర్యంలో రీయల్స్‌ స్వచ్ఛంద సంస్థలోని చిన్నారులకు అత్యవసర ప్రథమ చికిత్స కిట్లను పంపిణీ చేశారు. వినరుకుమార్‌ మాట్లాడుతూ ల్యాబ్‌ టెక్నీషియన్‌ వైద్య రంగంలో ప్రముఖ పాత్ర పోషిస్తారని వారిని ప్రభుత్వం గుర్తించి సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. కోవిడ్‌ సమయంలో టెక్నీషియన్ల పాత్ర కీలకమైందని ఎంతోమంది ప్రాణాలను పనంగా పెట్టి వైద్యసేవలు కొనసాగించారని, అలాంటి వారందరికీ టెక్నీషియన్‌ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంగళం హుంశిక డైయాగస్టిక్స్‌ నితిన్‌ యామిని, చైతన్య కుమార్‌, నీలకంఠం దిలీప్‌, సంస్థ నిర్వాహకులు కష్ణమూర్తి పాల్గొన్నారు.