Sep 25,2023 00:25

ఘనంగా ఎన్‌ఎస్‌ఎస్‌ దినోత్సవ వేడుకలు


ఘనంగా ఎన్‌ఎస్‌ఎస్‌ దినోత్సవ వేడుకలు
ప్రజాశక్తి -సోమల: మండల కేంద్రమైన ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులు అధ్యాపక బందం ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌ఎస్‌ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పలువురు ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాఠశాల ఆవరణంలోని పిచ్చి మొక్కలను చెత్తాచెదారని తొలగించి తమ సేవా భావాన్ని చూపిం చారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్‌ గంగాధర నాయుడు మాట్లాడుతూ మహాత్మా గాంధీ శత జయంతి ఉత్సవాలలో భాగంగా 1969 సెప్టెంబర్‌ 24వ తేదీ ప్రారంభించిన ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమం దేశవ్యాప్తంగా అమలు అవుతోందని విద్యార్థులు సేవా భావాన్ని పెంపొందించుకొని వారి వారి గ్రామాలలో పరిసరాల పరిశుభ్రత ఇతరులకు సేవ చేయడం సహాయ సహకారాలు అందించడం నేర్చుకోవాలని విద్యార్థుల ను కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ పలువురు విద్యార్థులు అధ్యాపక బందం పాల్గొన్నారు.