ప్రజాశక్తి -ఎస్‌ఆర్‌పురం: అభివద్ధి పనులలో భాగంగా స్వగ్రామమైన కొటార్లపల్లి, కొత్తపల్లిమిట్ట బసిరెడ్డిపల్లి సంబంధిత గ్రామ దేవత శ్రీద్రౌపది సమేత ధర్మరాజు ఆలయ ప్రాంగణంలో గ్రామస్తుల సహకారంతో అభివద్ధి పనులు చేపట్టడం చాలా సంతోషకరమని రాష్ట్ర ఆర్టీసీ వైస్ చైర్మన్ ఎంసి విజయానంద రెడ్డి అన్నారు. మండలంలోని కొత్తపల్లి గ్రామ పంచాయతీ 49 కొత్త పల్లిమిట్టలో మహాభారతంలో భాగంగా శ్రీద్రౌపది సమేత ధర్మరాజు ఆలయంలో ఎంసి విజయానంద రెడ్డి ఏడు లక్షలు తమ సొంత నిధులతో నాటక కళ క్షేత్రాన్ని తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్ధంగా నిర్మించి ఆదివారం ప్రారంభించారు. స్థానిక సర్పంచ్ డివి ఢిల్లెయ్య, ఆలయ ధర్మకర్త నాగరాజు, ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు కలిసి రాష్ట్ర ఆర్టీసీ వైస్ ఛైౖర్మన్ ఆలయ ప్రాంగణంలో చెట్లు నాటే కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ బాల సుబ్రహ్మణ్యం రెడ్డి, చంద్రయ్య నాయుడు, మాజీ ఎంపీపీ మోహన్ కోటి రెడ్డి బాబు, మాజీ సర్పంచ్ విజరు బాబు, గోవిందరెడ్డి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.










