ఘనంగా ద్రావిడ యూనివర్సిటీ సిల్వర్ జూబ్లీ వేడుకలు
ప్రజాశక్తి- గుడిపల్లి: ద్రావిడ విశ్వవిద్యాలయంలో బుధవారం సిల్వర్‌జూబ్లీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ భారత దేశంలోని ఎక్కడా లేని విధంగా భాషల కోసం యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ విశ్వవిద్యాలయం 25 సంవత్సరాలు పూర్తిచేసుకుని సిల్వర్‌జూబ్లీ వేడుకలు నిర్వహిస్తుండడం చాలా సంతోషకరమని తెలిపారు. ద్రావిడ ఉపకులపతి మన ప్రాంతవాసి కావడం, ఈ యూనివర్సిటీ పాండిచ్చేరితో కలిపి ఐదురాష్ట్రాలకు సంబంధించిన ఈ విశ్వవిద్యాలయం మరింత అభివద్ధి చెంది దేశంలోని నంబర్‌వన్ యూనివర్సిటీగా ఎదగాలని ఆయన పేర్కొన్నారు. రెండు డిపార్ట్మెంట్లతో మొదలై ప్రస్తుతం 21 డిపార్ట్మెంట్‌గా విస్తరించిందని పేర్కొన్నారు. 27 ద్రవిడియన్ భాషల పరిరక్షణకు విశ్వవిద్యాలయం కషి చేస్తుందని తెలిపారు. ఈవిశ్వవిద్యాలయం అభివద్ధి చెందడానికి గతంలో ఎన్‌టి రామారావు, ఆ తరువాత వైయస్ రాజశేఖర్ రెడ్డి కషి చేశారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అనంతరం ఉపకులపతి తుమ్మల రామకష్ణ మాట్లాడుతూ ఈవిశ్వవిద్యాలయం సిల్వర్‌జూబ్లీ వేడుకలు నిర్వహిస్తుండడం ఈ వేడుకలు తమ హయాంలో జరుగుతున్నడం చాలా ఆనందంగా ఉందన్నారు. భారతదేశంలో భాషల కోసం ఉన్న ఏకైక విశ్వవిద్యాలయం ఈ ద్రావిడ విశ్వవిద్యాలయం అని, ఇది మరింత అభివద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. ఈకార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్, రిజిస్టర్ వేణుగోపాల్‌రెడ్డి, రెక్టర్ అనురాధ, ఇతర అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు










