Feb 19,2022 21:48

జయంతి వేడుకలు జరుపుకుంటున్న దృశ్యం

ప్రజాశక్తి - రామసముద్రం : మండలంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నందు ప్రిన్సిపాల్‌ మురళీధర్‌ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివాజీ నాయకత్వ లక్షణాలు, మతసామరస్యం, తల్లి ప్రేమ గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, మరాఠా అధ్యక్షుడు గౌతమ్‌, రెడ్డి వినోద్‌, మరియు విద్యార్ధిని విద్యార్ధులు పాల్గొన్నారు.