మాట్లాడుతున్న ప్రిన్సిపాల్ డాక్టర్ భాస్కర్ రెడ్డి
ప్రజాశక్తి-పుత్తూరు టౌన్:
సోమవారం ప్రముఖ భౌతిక శాస్ర,్త నోబెల్ బహుమతి గ్రహీత ఆయిన ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ 143వ జయంతిని ఫిజిక్స్ శాఖ ఆధ్వర్యంలో కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రెండో ప్రపంచం యుద్ధం సమయంలో బాంబులపై పరిశోధన చేయడం వల్ల అను బాంబులు తయారీకి దారితీసిందని ఐన్‌స్టీన్ ప్రపంచాన్ని హెచ్చరించడం ప్రపంచం పట్ల ఆయనకున్న భాద్యతాయుతను చాటుతుందన్నారు. విద్యార్ధులు ఐన్‌స్టీన్‌ను ఆదర్శంగా తీసుకోని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధ్యక్షులు వి.వీరయ్య, సుజల, సురేష్ బాబు, రఘురాం, పురుషోత్తం విద్యార్థులు పాల్గొన్నారు.










