ఘనంగా
అక్కినేని జయంతి
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరావు జయంతి వేడుకలు ఆదివారం స్థానిక టిటిడి కళ్యాణ మండపంలో అక్కినేని, నాగార్జున అభిమాన సంఘాల నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకలకు ఎంఎల్‌ఏ ఆరణి శ్రీనివాసులు, నగర మేయర్ అముద ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. అక్కినేని, ఎన్‌టిఆర్ తెలుగు చిత్ర సీమకు రెండు కళ్ళువంటి వారని అక్కినేని అనేక సాంఘీక సామాజిక చిత్రాలు తెలుగు వారికి అందించారన్నారు. అక్కినేని జయంతిని చిత్తూరులో జరపడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా పలువురికి అవార్డులు ప్రదానం చేశారు. అక్కినేని అభిమాన సంఘాల విజ్ఞప్తి మేరకు చిత్తూరులో అక్కినేని నాగేశ్వరావు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని కేటాయించనున్నట్లు నగర మేయర్ అముద తెలిపారు. ఈ కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వర్‌రావు వీరభిమాని ఖురీష్‌భాషా, నాగార్జున అభిమాన సంఘం జిల్లా అధ్యక్షులు ఎత్తిరాజులు, రిటైర్డ్ పోలీస్ ఉద్యోగుల సంఘం నాయకులు మురళితో పాటు పలువురు అక్కినేని నాగేశ్వరావు, నాగార్జున అభిమానులు పాల్గొన్నారు.










