ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం
పెంచిన గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో గురువారం స్థానిక పోలీసు ఐల్యాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నేతలు కరెడ్ల రామకృష్ణ, మడక రాజు మాట్లాడుతూ ఇప్పటికే భారాలతో జనం సతమతమవుతుంటే మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మోడీ ప్రభుత్వం గ్యాస్ ధర పెంచిందన్నారు. పెంచిన గ్యాస్ ధర తగ్గించే వరకు పోరాడతామన్నారు. గ్యాస్‌కు సబ్సిడీ సొమ్ము సైతం ఎగవేయడం దారుణమన్నారు. కార్యక్రమంలో జవ్వాది శ్రీను, అగుర్తుల రామోహనరావు, కాలపురెడ్డి కొండలరావు, రౌతు వెంకటనాగేంద్ర, పతివాడ నాగేంద్రబాబు, కన్నంరెడ్డి శివాజీ, కలిగట్ల వీర్రాజు, జవ్వాది శివ, నీరుకొండ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
మాధవరంలో
పెంచిన గ్యాస్ ధరను తగ్గించాలని మాధవరంలో సిపిఎం ఆధ్వర్యాన దర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ గ్రామ నేత పురిటిగడ్డ జయమ్మ మాట్లాడగా గోపాల వెంకట్రావు, మంచాల పాపమ్మ, తానేటి మంగ, ఆకుమర్తి చిన్ని, గురుపల్లి కృప, కడిమి కుమారి, కాకులపాటి సావిత్రమ్మ, తానేటి శ్రావణి, కె.ప్రభావతి, కె.బుజ్జి పాల్గొన్నారు.
పోడూరు: పెంచిన వంటగ్యాస్ ధరను తగ్గించాలని సిపిఎం మండల కార్యదర్శి పిల్లి ప్రసాద్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెనుమదంలో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో నేతలు కౌలు శ్రీను, దొంగ నాగేశ్వరరావు, దొంగ నెలబాలుడు, దొంగ చల్లారావు, బొంతు సత్యనారాయణ పాల్గొన్నారు.
పెనుగొండ: పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని స్థానిక కోడిపందేల దిబ్బ వద్ద సిపిఎం ఆధ్వర్యాన గురువారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత షేక్ పాదుషా మాట్లాడగా మాదాసు నాగేశ్వరరావు, గుర్రాల సత్యనారాయణ, నేలపు ఆదినారాయణ, గెద్దాడ శ్రీను, ఏసు, గుడాల వాణి, చింతపల్లి లక్ష్మి, వీరవల్లి లక్ష్మి పాల్గొన్నారు.
ఆచంట: పెంచిన గ్యాస్ ధర తగ్గించాలని సిపిఎం ఆధ్వర్యంలో బ్రాహ్మణచెరువు చిన్న వంతెన వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి కె.సుబ్బరాజు మాట్లాడగా చింతపల్లి లక్ష్మీకుమారి, కోడి శ్రీనివాస ప్రసాద్, ఇందుకూరి వెంకటరాజు, దిద్దే వెంకటరావు, భాస్కర్‌రావు, రామకృష్ణ, లక్ష్మణరావు, సూర్యనారాయణ పాల్గొన్నారు.










