Apr 03,2022 22:49

గురువులను సన్మానిస్తున్న పూర్వ విద్యార్థులు

ప్రజాశక్తి - రామచంద్రాపురం : మండలంలోని తిమ్మ రాజుపల్లిలో వెలసి ఉండిన శ్రీసాయి కష్ణ విద్యానికేతన్‌ పాఠశాలలో 2001 -2002వ సంవ త్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థులు తమ పూర్వ గురువులను ఆదివారం కలుసుకుని ఘనంగా సన్మా నించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తమను క్రమశిక్షణకు మారుపేరుగా తయారుచేయడంలో గురువులు చేసిన కషిని వారు కొనియాడారు. పాఠశాల గదిలోనే దేశ భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని అనడంలో ఉపాధ్యాయులు చేసిన కషి ఎంతో గణనీయమైనది గుర్తు చేశారు. అనంతరం గురువులను శాలువలు కప్పి జ్ఞాపకాలు అందించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఉత్తమ ఉపాధ్యాయులు అయిన రూపసుందర్‌ నాయుడు, సుభాషిణి దంపతులను, ఆదినారాయణ రెడ్డి, రమణయ్య, జనార్దన్‌ నాయుడు, రూప సుందర్‌ రెడ్డి, నాదముని రెడ్డి, గ్రామపెద్ద బీకి రెడ్డి తదితరులను సన్మానించి, ఆశీర్వాదాలు పొందారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు నాగార్జున, బెనర్జీ, ముని శంకర్‌, వేణు గోపాల్‌, జగన్మోహన్‌ రెడ్డి, మణికంఠ, హరి, రోశిరెడ్డి, దిలీప్‌, భారత్‌, సుధాకర్‌, కరుణాకర్‌, ఈశ్వర్‌ రెడ్డి, నారదముని రెడ్డి, చందమ్రౌలి, స్వాతి, కల్పన, విమల, నాగవేణి, అనసూయ, హేమ,నిర్మల తదితరులు పాల్గొన్నారు.