Oct 09,2023 17:40

వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

ప్రజాశక్తి -నెల్లూరు :మైనారిటీ గురుకుల పాఠశాలను వీలైనంత త్వరగా పూర్తిచేసి విద్యార్థులు ఆటోనగర్‌ నుంచి అక్కచెరువుపాడుకు మార్చే విధంగా చర్యలు చేపట్టాలని ఆవాజ్‌ జిల్లా నాయకులు కోరారు. సోమవారం స్పందన కార్యక్రమంలో పాల్గొన్న ఆవాజ్‌ జిల్లా నాయకులు కలెక్టర్‌ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆవాజ్‌ జిల్లా కార్యదర్శి షేక్‌ రషీద్‌ మాట్లాడుతూ జిల్లా మైనా రిటీ సంక్షేమ శాఖ అధికారులు ఈ పాఠశాల నిర్మాణ పనులు 2020 నాటికి పూర్తి చేస్తామని చెప్పారన్నారు. రాష్ట్రంలో వచ్చే సంవత్సరంలో ఎన్నికలు ఉన్నందున కోడ్‌ వచ్చే అవకాశముందని, ఈ నేపథ్యంలో రానున్న మూడు నెలల్లోగా గురుకుల పాఠశాల పూర్తయ్యే విధంగా చూడాలని కోరారు. ఆవాజ్‌ జిల్లా కమిటీ సభ్యులు షేక్‌ చాన్‌ బాషా, మహమ్మద్‌ సర్దార్‌ అహ్మద్‌, షేక్‌ ఫయాజ్‌, షేక్‌ మీరా, షేక్‌ ఉస్మాన్‌, షేక్‌ ఫయాజ్‌ ఇన్సాఫ్‌ జిల్లా కార్యదర్శి అహ్మద్‌ బాషా ఉన్నారు.