ప్రజాశక్తి-పెద్దపంజాణి: మండలంలోని కోగిలేరు అటవీప్రాంతం బోడిబండ సమీపంలో సుమారు 60ఏళ్ళ వృద్దుడి మృతదేహం పడివున్న సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం మేరకు ఈ నెల 26న సాయంత్రం గొర్రెల కాపరి అటవీ ప్రాంతంలో గొర్రెలు మేపుతుండగా ఎవరో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం పడివున్న విషయం గుర్తించి పోలీసులకు సర్పంచ్ రమేష్ బాబుకు, సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సర్పంచ్,ఎస్ఐ స్వర్ణతేజ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు.అలాగే స్థానిక, పంచాయతీ కార్యదర్శి గణపతి,విఆర్ఓ సుధాకర్, ఎంపీటీసీ పరందామ, సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి ఆచూకీ కోసం చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు సమాచారం అందించారు. ఐతే ఆచూకీ తెలియకపోవడంతో సంఘటన స్థలంలోనే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి విఆర్ఓ పిర్యాదు మేరకు ఎస్ఐ స్వర్ణతేజ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై తెలిపారు. స్థానిక సర్పంచ్ రమేష్ బాబు గుర్తుతెలియని వృద్దుడి మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు పూర్తి చేయించారు.










