Oct 04,2023 21:00

సన్మానిస్తున్న దృశ్యం

సన్మానిస్తున్న దృశ్యం
గుండె వ్యాధుల నివారణపై అవగాహన
ప్రజాశక్తి-నెల్లూరు:నారాయణ ఆస్పత్రి గుండె వైద్యులు డాక్టర్‌ కె.తిలక్‌ కుమార్‌ రెడ్డి జెసిఐ ఇండియా సీనియర్‌ మెంబర్స్‌ అసోసియేషన్‌ సభ్యులకు గుండె వ్యాధుల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ హాస్పిటల్‌ గుండె వైద్యులు డాక్టర్‌ కె తిలక్‌ కుమార్‌ రెడ్డి గుండె జబ్బులకు సంబంధించిన అనేక అంశాలను వివరించారు. గుండెపోటుకు ముందస్తు లక్షణాలు చికిత్సలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాల గురించి వివరించారు. అనంతరం సదస్సులో పాల్గొన్న సభ్యులు వారికి ఉన్న అపోహలను సందేహాలను డాక్టర్‌ తో చర్చించి నివత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా విచ్చేసిన నారాయణ హాస్పిటల్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బి హరి ప్రసాద్‌ రెడ్డి మాట్లాడుతూ నారాయణ హాస్పిటల్‌ లో గుండె వ్యాధులు విభాగం ఎంతో పటిష్టంగా ఉందన్నారు. దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన గుండె వైద్యులు అత్యంత అధునాతన ఎఫ్‌ డి 20 క్లారిటీ కేథలాబ్‌ సహాయంతో 24/7 స్పెషలిస్టుల పర్యవేక్షణలో ఎటువంటి గుండె సమస్యలకైనా వైద్య చికిత్సలు అందించే నిపుణులైన వైద్య బందం నారాయణ హాస్పిటల్‌ లో అందుబాటులో ఉంటారన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్‌ఎంఎస్‌ జోన్‌
చైర్మన్‌ కోట సత్యనారాయణ మాట్లాడుతూ ఈ అవగాహన కార్యక్రమంలో గుండె వ్యాధులపై ఎంతో అవగాహనను పెంపొందించిన నారాయణ హాస్పిటల్‌ యాజమాన్యానికి కతజ్ఞతలు తెలియజేశారు భవిష్యత్తులో ఇటువంటి మరిన్ని అవగాహన కార్యక్రమాలను తమ అసోసియేషన్‌ సభ్యులకు నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో జెసిఐ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ పివి సత్యనారాయణ, నారాయణ హాస్పిటల్‌ ఏజీఎం ఏసి శేఖర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.