ప్రజాశక్తి -నెల్లూరు :నారాయణ ఆస్పత్రి గుండె వైద్యులు డాక్టర్ కె తిలక్ కుమార్ రెడ్డి జెసిఐ ఇండియా సీనియర్ మెంబర్స్ అసోసియేషన్ సభ్యులకు గుండె వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నారాయణ హాస్పిటల్ గుండె వైద్యులు డాక్టర్ కె తిలక్ కుమార్ రెడ్డి గుండె జబ్బులకు సంబంధించిన అనేక అంశాలను వివరించారు. గుండెపోటుకు ముందస్తు లక్షణాలు, చికిత్సలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాల గురించి వివరించారు. నారాయణ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి హరి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ నారాయణ ఆస్పత్రిలో గుండె వ్యాధులు విభాగం ఎంతో పటిష్టంగా ఉందన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్‌ఎంఎస్ జోన్ చైర్మన్ కోట సత్యనారాయణ మాట్లాడుతూ ఈ అవగాహన కార్యక్రమంలో గుండె వ్యాధులపై ఎంతో అవగాహనను పెంపొందించిన నారాయణ హాస్పిటల్ యాజమాన్యానికి కతజ్ఞతలు తెలిపారు. జెసిఐ ఇండియా వైస్ ప్రెసిడెంట్ పివి సత్యనారాయణ, నారాయణ హాస్పిటల్ ఏజీఎం ఏసి శేఖర్ రెడ్డి ఉన్నారు.










