గుమ్మఘట్ట : మండల పరిధిలోని 75 వీరాపురం గ్రామానికి చెందిన మాజీ ఎంపిపి పూజారి పాలయ్య (72) మంగళవారం రాత్రి అనారోగ్యంతో మతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు ఆయన భౌతిక కాయాన్ని బుధవారం సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాలవ మాట్లాడుతూ పూజారి పాలయ్య తనకెంతో ఆప్తుడని తెలిపారు. పాలయ్య 2017 నుంచి 2019 వరకు గుమ్మగట్ట మండల ఎంపీపీగా పని చేశారని చెప్పారు. పార్టీలకతీతంగా తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించి ప్రజల మన్ననలు పొందారని తెలిపారు. పాలయ్య కుటుంబానికి భవిష్యత్తులో తాను పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ ఛైర్మన్ పూల నాగరాజు, వైసీపీ నాయకులు మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ గౌని ఉపేంద్ర రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, 75 వీరాపురం సర్పంచి నాగరాజు, మాజీ ఎంపిపి గిరి మల్లప్ప, మాజీ సర్పంచి రంగస్వామి, టిడిపి నాయకులు సదాశివ, తిప్పేరుద్ర, సత్యనారాయణ, ఉస్మాన్, గోపాల్ పాల్గొన్నారు.










