'గృహ నిర్మాణాలు వేగవంతం చేయించాలి'
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: రాష్ట్ర ప్రభుత్వం గృహనిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని వేగవంతంగా గృహ నిర్మాణాలు పూర్తి చేయాలని నిర్దేశించు కొన్న లక్ష్యాలను చేరాలని జిల్లా కలెక్టర్ ఎస్.షన్మోహన్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్‌ను ఎంపీడీవోలు గృహనిర్మాణశాఖ అధికారులతో నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పేదలందరికి ఇల్లు కార్యక్రమంలో భాగంగా ఇండ్ల పురోగతికి సంబంధించి వారపు లక్ష్యాలను నిర్ణయించుకోవడం జరుగుతోందని ఆ లక్ష్యాలను చేరాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. స్టేజి కన్వర్షన్ వేగవంతంగా నిర్వహించి గహనిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. గృహనిర్మాణాలకు ఇంకా ఏవైనా సమస్యలు ఉన్నాయా అని ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో అధికారులను జిల్లా కలెక్టర్ ప్రశ్నించారు. ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించడం జరుగుతుందని లబ్ధిదారుల ద్వారా గహనిర్మాణాలు వేగవంతం చేయించాలని కలెక్టర్ అన్నారు. స్టేజీల వారీగా జరుగుతున్న కన్వర్షన్‌తో పాటు పూర్తి అయిన నిర్మాణాల గురించి జిల్లా కలెక్టర్ ఎంపీడీవోలు గృహనిర్మాణ శాఖ అధికారులను ప్రశ్నించారు. లక్ష్యాలను మీరే నిర్ణయించుకున్నప్పుడు వాటిని చేరే బాధ్యత విషయంలో కచ్చితంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ పద్మనాభం పాల్గొన్నారు.










