Aug 11,2022 21:59

గృహ నిర్మాణాలు త్వరగా పూర్తికావాలి:ఎంపిడిఓ
ప్రజాశక్తి- బైరెడ్డిపల్లి:
మండల పరిధిలో ప్రభుత్వం మంజూరు చేసిన నూతన గహాలు త్వరగా పూర్తి కావాలని ఎంపీడీఓ రాజేంద్ర బాలాజీ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఆయన జగనన్న నూతన గృహాల నిర్మాణాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పునాదులు, గోడలు, మోల్డింగ్‌ దశలో ఉన్న గృహాలు వెంటనే పూర్తి చేసి ప్రభుత్వం మంజూరు చేసిన బిల్లులను పొందాలని అన్నారు. గృహనిర్మాణాలు పూర్తి చేయని వారిపై ఉన్నతాధికారులకు నివేదికలు పంపాలని సూచించారు. స్థానిక సచివాలయంలో ఎంపిడిఓ హౌసింగ్‌ ఏఈ స్వామిదాస్‌, గ్రామ,వార్డు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ లబ్దిదారులతో త్వరగా ఇంటి నిర్మాణాలు చేయించాలని అన్నారు.
గహనిర్మాణాలపై సమీక్ష
సోమల: వైఎస్సార్‌ కాలనీలలో గహనిర్మాణలను వేగవంతం చేయాలని, లబ్ధిదారులు త్వరితగతిన పనులు పూర్తిచేసి గహప్రవేశాలు చేయాలని మండలస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు కోరారు. మండలంలోని నెల్లిమంద, పొదలకుంటపల్లి పంచాయతీలలో స్థానిక సచివాలయాలలో గురువారం లబ్ధిదారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సకాలంలో బిల్లులు చెల్లిస్తామని నిర్మాణాలను చేపట్టి ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని వారు కోరారు. ఈకార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.