Jun 29,2022 22:43

గృహ నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకోవాలి : జెసి
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌
: రాష్ట్రప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన సచివాలయ సిబ్బంది ప్రభుత్వ లక్ష్యాలను సాధించే దిశగా కషి చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ అన్నారు. బుధవారం జాయింట్‌ కలెక్టర్‌ బంగారుపాలెం మండలంలో పర్యటించారు. ఈసందర్భంగా మండల కార్యాలయాన్ని పరిశీలించిన జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ చెన్నై - బెంగళూరు ఎక్స్ప్రెస్‌ హైవే పరిహారంకి సంబంధించి పైళ్లను వెంటనే క్లియర్‌ చేయాలని గురువారం సాయంత్రం లోపల పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే రహదారి పనులు వేగంగా చేయాలంటే భూసేకరణలో ఎటువంటి సమస్యలు లేకుండా ఉండాలని జాయింట్‌ కలెక్టర్‌ అన్నారు. అనంతరం జాయింట్‌ కలెక్టర్‌ ఈచనేరిపల్లి, తుంబకుప్పం గ్రామ సచివాలయాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వన్‌ గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా వేలాది మంది ఉద్యోగ అవకాశం పొందారని ప్రస్తుతం ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులుగా మారారని, రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడంతోపాటు పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకంగా ఉండాలన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు బయోమెట్రిక్‌ హాజరుతోపాటు క్యాంపు వెళ్లేటట్లు ఉంటే మూవ్మెంట్‌ రిజిస్టర్‌ సక్రమంగా నిర్వహించుకొని గ్రామీణ ప్రాంత ప్రజల అభివద్ధికి ఉపయోగపడాలని సూచించారు. అదేవిధంగా ప్రభుత్వం మంజూరు చేసిన ప్రభుత్వ భవనాల నిర్మాణాలను వెంటనే పూర్తిచేసేలా చర్యలు తీసుకుని ఉద్యోగులకు మంచి వసతి ఉండేలా చూడాలన్నారు. ఈసందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ తుంబగ్రామంలో గహనిర్మాణాలను పరిశీలించారు. నవరత్నాలలో భాగంగా అందరికీ వసతి కల్పించాలని గహ నిర్మాణాలు భారీ ఎత్తున చేపట్టడం జరిగిందని, ఈనిర్మాణాలు వెంటనే పూర్తి చేసుకుని గహయజమానులు అయ్యేలా చూడాలన్నారు. కాలనీలకు సంబంధించి అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని, లబ్ధిదారులు గహ నిర్మాణాలను వేగంగా చేసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ సుశీల పాల్గొన్నారు.