Oct 04,2023 21:29

ఫొటో : రికార్డులు పరిశీలిస్తున్న జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కె.కుమారరాజా

గ్రంథాలయంలో తనిఖీలు
ప్రజాశక్తి-మర్రిపాడు : వార్షిక తనిఖీలలో భాగంగా స్థానిక గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కె.కుమారరాజా బుధవారం సందర్శించారు. ఆయన గ్రంథాలయంలోని రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మెంబర్‌షిప్‌, రీడర్‌షిప్‌ పెంపుదల చేయాలని సలహాలు సూచనలిచ్చారు. 2022-23 సంవత్సరానికి గ్రంథాలయానికి 890 కొత్త పుస్తకాలు సరఫరా చేశామని, నిరుద్యోగ పోటీపరీక్షలు రాసే విద్యార్థుల కోసం ఆన్‌ డిమాండ్‌ ద్వారా పుస్తకాలు పంపిణీ చేస్తామన్నారు.
వర్షాలకు భవనం ఉరుస్తూ పుస్తకాలు తడుస్తున్నాయని, గ్రంథాలయ భవన మరమ్మత్తుల కోసం నిధులు మంజూరు చేయాలని గ్రంథ భాండాగారి కోరారు. గ్రంథాలయ సెస్‌ విషయంలో మండలస్థాయి అధికారులను కలసి కృషి చేయాలని సూచించారు. ఆయనవెంట ఇన్‌ఛార్జి గ్రంథ భాండాగారి నారాయణరావు, కెఎన్‌ పల్లి బిడిసి ఎల్‌ నిర్వాహకురాలు ప్రభావతి ఉన్నారు.