వేసవి శిబిరంలో పాల్గొన్న చిన్నారులు
ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత వేసవి శిక్షణా కార్యక్రమంలో విద్యార్థులు హాజరై పలు విభాల్గో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా గ్రంధాలయాల్లో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్ శనివారం ఆరవ రోజుకు చేరుకున్నాయి. విద్యార్థులు విశేషంగా హాజరవడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. అనంతపురంలో నిర్వహించిన కార్యక్రమంలో సూర్య నమస్కారాలు, కథలు చెప్పడం, డ్యాన్స్, కథలు చదవడం వంటి కార్యక్రమాల్లో 72 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సిబ్బంది ఇంతియాజ్, కావేరి, హేమ మాలిని, ఇందిర, విద్యార్థులు వారి తల్లి దండ్రులు పాల్గొన్నారు.










