Feb 22,2022 22:42

గ్రంథాలయ కమిటీి సభ్యులతో చర్చిస్తున్న ఛైర్‌పర్సన్‌ మధుబాల

ప్రజాశక్తి - చిత్తూరుఅర్బన్‌ : జిల్లాలోని గ్రంథాల యాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎన్‌.మధుబాల పేర్కొన్నారు. మంగళ వారం ఉదయం స్థానిక జిల్లా గ్రంథాలయ సంస్థ నందు పుస్తక ఎంపిక కమిటీ సర్వసభ్య రెండవ సమావేశం, 2022- 2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సాధారణ బడ్జెట్‌ ఆమోదం కోసం నిర్వహించిన కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఛైర్మన్‌ మధుబాల మాట్లాడుతూ 2022-2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సాధారణ బడ్జెట్‌ రూ.20.23 కోట్లతో ప్రతిపాదనలు ఆమోదించి గ్రంథాలయ సంస్థ డైరెక్టర్‌కు పంపడం జరుగు తుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి సహకారంతో జిల్లాలోని అన్ని గ్రంథాల యాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లా కేంద్రంలో రూ. 4 కోట్లతో జిల్లా గ్రంథాలయ భవన పునఃనిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. మొలకలచెరువు, నిమ్మనపల్లి మండల కేంద్రాలలో గ్రంధాలయాల భవన నిర్మాణాల ఏర్పాటుకు సంబంధించి స్థలాలు అందుబాటులో ఉన్నాయని, త్వరలో గ్రంథాలయాల భవన నిర్మాణ పనులు చేపట్టడం కొరకు తగిన చర్యలు తీసుకుంటు న్నామన్నారు. రూ.1.09 కోట్లతో శ్రీకాళహస్తి, తొట్టంబేడు, వరదయ్యపాలెం, పెద్దమండ్యం మండల కేంద్రాల్లో గ్రంథాలయ భవనాల నిర్మాణ పనులకు రీటెండర్లు పిలవడం జరుగుతుందన్నారు. సెస్సు బకాయలను కూడా స్థానిక సంస్థల నుండి వసూళ్లు చేయుటకు కషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వయోజన విద్య ఉప సంచాలకులు మహమ్మద్‌ అజిమ్‌,జిల్లా గ్రంథాలయ కార్యదర్శి ప్రకాష్‌, తదితరులు పాల్గొన్నారు.