May 09,2023 21:43

బదిలీపై వెళ్తున్న గ్రంథాలయ ఉద్యోగిని సన్మానిస్తున్న ఛైర్‌పర్సన్‌, ఉద్యోగులు

       అనంతపురం కలెక్టరేట్‌ : గ్రంథాలయ గ్రేడ్‌-1 అధికారి కాసు ఆదిలక్ష్మి సేవలు ఆదర్శనీయం అని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్సన్‌ ఎల్‌ఎం.ఉమామోహన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పి.రమ అన్నారు. మంగళవారం జిల్లా గ్రంధాలయ సంస్థ రాయదుర్గం శాఖ గ్రంథాలయంలో గ్రేడ్‌-1 గ్రంథాలయ అధికారిణిగా పని చేస్తున్న కాసు ఆదిలక్ష్మి ఉద్యోగోన్నతిపై ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో గ్రంథాలయ అధికారిణి ఆదిలక్ష్మిని ఆత్మీయంగా శాలువా, జ్ఞాపక అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా ఛైర్‌పర్సన్‌ ఉమామోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఆదిలక్ష్మి మంచి అధికారిణి అన్నారు. తాను మహిళ అయినందున సాటి మహిళలుగా కలిసి మెలసి పని చేయడం సంతోషంగా ఉందన్నారు. గ్రంథాలయాలపై మంచి అవగాహన కలిగి ఉండి ఎక్కడ సమస్య రాకుండా చూడటంలో తనదైన పాత్ర పోషించారని అభినందించారు. మాజీ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ ఎల్‌ఎం.మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఆదిలక్ష్మి అందించిన సేవలు నిలిచిపోతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.