Apr 27,2022 16:21

ప్రజాశక్తి-వి కోట : సమతుల్యమైన ఆహారాన్ని  తీసుకోవడం ద్వారా గర్భిణీలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండగలరని ఓగు పీహెచ్సీ వైద్యులు రాజేష్ నాయక్ అన్నారు. బుదవారం ఓగు పీహెచ్సీ ఆవరణంలో గర్భిణీలకు ఆరోగ్య మేళా నిర్వహించారు. ఆరోగ్యం కోసం పాటించాల్సిన చర్యలు.. తీసుకోవాల్సిన సమతుల్య ఆహారం.. గర్భణీలతో పాటు ఉండే వారు పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. రక్తహీనత,  ఇతర ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించి వారికి అవసరమైన మందులను అందజేశారు. గర్భణీలకు అవసరమైన వివిధ రకాల పరీక్షలు నిర్వహించి రుగ్మతలు గల వారి పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఓగు పీ హెచ్ సీ వైద్యులు డా. రాజేష్ నాయక్, స్టాఫ్ నర్స లాలస, నర్సులు సౌజన్య, కమల, పీహెచ్ ఎన్లు.. ఏ ఎన్ ఎం లు, ఆశా ఇతర సిబ్బంది పాల్గొన్నారు..