Mar 17,2023 20:56

ప్రజాశక్తి - పాలకోడేరు
గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలని పిహెచ్‌సి వైద్యుడు డాక్టర్‌ రంగం నాయుడు అన్నారు. మోగల్లు గ్రామంలో శుక్రవారం ఫ్యామిలీ ఫిజీషియన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలకు పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. కార్యక్రమంలో సిహెచ్‌ఒ సత్యనారాయణ, ఎఎన్‌ఎంలు ఉషా కుమారి, ఉషా సుందరి, హెల్త్‌ అసిస్టెంట్‌ బురాన్‌ ఖాన్‌ పాల్గొన్నారు.