Apr 09,2022 21:43

మహతి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో
గర్భిణులకు పౌష్టికాహారం పంపిణీ
ప్రజాశక్తి- బైరెడ్డిపల్లి: మండల కేంద్రంలోని మహతి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో శనివారం ఉదయం స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఆవరణంలో మండల కేంద్ర గర్భిణులకు పౌష్టికాహారం పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పిహెచ్‌సి అధికారి విజయచంద్రన్‌, అనురాధ మాట్లాడుతూ స్త్రీలు గర్భసమయంలో ఆరోగ్యంపై చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రతి నెలా క్రమం తప్పకుండా 9వ తేదీ ప్రభుత్వ ఆసుపత్రిలో చెకప్‌ చేసుకోవాలన్నారు. గర్భిణులు మొదటి నుంచి పౌష్టిహాకారం తీసుకోవడం ద్వారా తల్లీబిడ్డల ఆరోగ్యంగా ఉండటంతో పాటు కాన్పు సులభంగా అవుతుందని తెలిపారు. అనంతరం గర్భిణులకు పండ్లు, గుడ్లు, వంటి పౌష్టికాహారంను అందించారు. కార్యక్రమంలో 108 సిబ్బంది, బైరెడ్డిపల్లి పిహెచ్‌సి ఏఎన్‌ఎంలు, మహితి కేత్రసిబ్బంది శ్రీనివాసులు, టిఎస్‌ బుజ్జి పాల్గొన్నారు.