ఈవో రామాంజనేయులు రెడ్డికి వినతి
ప్రజాశక్తి- రేణిగుంట : మండలంలోని కరకంబాడి గ్రామపంచాయతీలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులు 16 మందికి ఈపీఎఫ్, ఈఎస్‌ఐ, గుర్తింపు కార్డులు, కనీస సౌకర్యాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఏపీ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం కరకంబాడి పంచాయతీ కార్యాలయం వద్ద ఈవో రామాంజనేయులు రెడ్డికి 'వినతి పత్రం' అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల అధ్యక్ష- కార్యదర్శులు టి. నరసింహారెడ్డి, కె.హరినాథ్ మాట్లాడుతూ.. కరకంబాడి గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, కనీస సౌకర్యాలు వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు. ఈవో రామాంజనేయులు రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో కరకంబాడి గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షలు జి.సుబ్రమణ్యం, ప్రధాన కార్యదర్శి పి.దీప, కోశాధికారి భాస్కర్, ఉపాధ్యక్షులు సరసమ్మ, సహాయ కార్యదర్శి వి.సురేష్ కమిటీ సభ్యులు గోపాల్, రమణయ్య, కీర్తన, రాజశేఖర్, చౌడమ్మ, కోదండ రామయ్య, సిఐటియు మండల కార్యదర్శి కె. హరినాథ్, అధ్యక్షుడు నరసింహారెడ్డి, తారకరామానగర్ ఐద్వా కార్యదర్శి మమత తదితరులు పాల్గొన్నారు.










