Oct 19,2023 21:04

మాట్లాడుతున్న అధికారులు

ప్రజాశక్తి-నెల్లూరు : ఆర్‌.డి. ఎస్‌.ఎస్‌. (పునరద్ధరించిన పంపిణీ పథకం) ద్వారా జిల్లాకు 717.25 కోట్ల రూపాయలు తో గ్రామాలకు త్రీఫేస్‌ విద్యుత్‌ సరఫరా అందించనున్నట్లు దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ ఛైర్మెన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె.సంతోష రావుతెలిపారు. గురువారం నగరంలోని విద్యుత్తు భవన్‌లో నెల్లూరు టౌన్‌ డివిజన్‌ విద్యుత్‌ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చీఫ్‌ జనరల్‌ మేనేజర్లు కె. గురవయ్య , కె.ఆర్‌.ఎస్‌.ధర్మజ్ఞాని , నెల్లూరు సర్కిల్‌ సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ వి.విజయన్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్స్‌ ఏ. సోమశేఖర్‌ రెడ్డి,బాల చంద్ర,శ్రీధర్‌, మధు,రాఘవేంద్ర అకౌంట్స్‌ ఆఫీసర్‌ విజిత ,డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్స్‌,అసిస్టెంట్‌ ఇంజనీర్స్‌ , అకౌంట్స్‌ అధికారులు ఉన్నారు.