ప్రజాశక్తి - ఉండి
గ్రామాల అభివృద్ధే తన లక్ష్యమని డిసిసిబి ఛైర్మన్ పివిఎల్.నరసింహరాజు అన్నారు. మండలంలోని కలిగొట్ల సచివాలయ పరిధిలో బుధవారం నిర్వహించిన గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో డిసిసిబి ఛైర్మన్ పివిఎల్.నరసింహరాజు, వైసిపి నాయకులకు గ్రామంలోని ప్రజలు హారతులతో బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర జానపద సృజనాత్మక అకాడమీ కార్పొరేషన్ డైరెక్టర్ గులిపల్లి అచ్చారావు, చింతలపాటి వెంకట్రామరాజు మాట్లాడుతూ కలిగొట్ల గ్రామం టిడిపికి పట్టుకొమ్మ అని అటువంటి గ్రామంలో పివిఎల్ నరసింహరాజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. అనంతరం పివిఎల్.నరసింహరాజు మాట్లాడుతూ గ్రామంలోని ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి గడపగడపకు తిరుగుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి శ్రీహరి నారాయణరాజు, పార్టీ గ్రామ అధ్యక్షులు చింతలపాటి రఘుపతిరాజు, పార్టీ మండల అధ్యక్షులు పివిఆర్‌కె ఆంజనేయరాజు, రూరల్ బ్యాంక్ త్రిసభ్య కమిటీ ఛైర్మన్ పేరిచర్ల నరసింహరాజు పాల్గొన్నారు.










