ప్రజాశక్తి-తిరుపతి సిటి
స్థానిక ఎస్‌వి మెడికల్ కళాశాల వద్ద డిఎంహెచ్‌వోను, వైద్యాధికారులను తల్లిదండ్రులు బుధవారం కలిసి వేడుకున్నారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో మూడు వందల మంది మెడిసిన్ చదువుతున్న విద్యార్థులు ఉన్నారని, వారిని తమ స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. అలాగే విజయవాడలోని తల్లిదండ్రులు తరపున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వినతి పత్రం ఇస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ తెలిపారు. బెలారస్ చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతూ తమ పిల్లలను క్షేమంగా తమ వద్దకు చేర్చాలని తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వానీ కేంద్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం విద్యార్థులను స్వస్థలాలకు చేర్చేందుకు కృషి చేస్తుందని, ఆ దిశగా ప్రభుత్వ పెద్దలతో సంప్రదిస్తున్నామన్నారు.










