Mar 21,2022 23:22

బాధితురాలిని పరామర్శిస్తున్న ఐద్వా నాయకులు



ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌:

సోమవారం ప్రాణాపాయస్థితిలో ఆసుప్రత్రిలో ఉన్న బాధితురాని సాయిలక్ష్మీతోపాటు నగర కార్యదర్శి జయంతి, ఎన్‌ఎఫ్‌డబ్ల్యూఐ జిల్లా కార్యదర్శి నదియా, మంజుల పరామర్శించారు. వారు మాట్లాడుతూ రోజురోజుకు మహిళలపై హింస, అత్యాచారాలు, లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయని అన్నారు. వీటిని కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఎన్ని చట్టాలు వచ్చినా వాటి వలన ప్రయోజనం మాత్రం శూన్యమని అన్నారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా ఈకేసు త్వరిగతిన విచారణ జరిపి నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌ చేశారు.