Oct 19,2023 19:15

గొడుగులు అందజేస్తున్న దృశ్యం

గొడుగులు అందజేస్తున్న దృశ్యం
గొడుగులు అందజేత
ప్రజాశక్తి-కావలి.:పట్టణంలో బుధవారంరాత్రి బందావనం కాలనీలో వెలసి ఉన్న శ్రీ వెంకటేశ్వరునికి ''కావలి పట్టణ మండల విశ్వబ్రాహ్మణుల సేవా సంఘం''ఆధ్వర్యంలో గొడుగులు సమర్పణ కార్యక్రమం రంగ రంగ వైభవంగా జరిగింది. పట్టణంలోని విష్ణాలయం నుండి విశ్వబ్రాహ్మణులు పసుపు వస్త్రాలు ధరించి, ఎంతో నిష్టగా విశ్వబ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు పుత్తూరు సుధాచారి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుని పటాన్ని పట్టుకుని గొడుగులతో, గోవింద నామస్మరణలతో ముందుకు సాగారు.