ప్రజాశక్తి-తాడిపత్రి తాడిపత్రి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని వినాయక మండపాల ఎలాంటి రాజకీయ ప్రసంగాలు, నినాదాలు చేయకూడదని డీఎస్పీ గంగయ్య తెలిపారు. గురువారం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వినాయక మండపాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా కార్యనిర్వాహకులు బాధ్యత తీసుకోవాలన్నారు. అలాగే గాలివానలను దృష్టిలో ఉంచుకుని దృఢంగా మండపాలను నిర్మించుకోవాలన్నారు. రాత్రి 10 గంటల వరకూ మాత్రమే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకోవాలన్నారు. మండపాల వద్ద రాజకీయ ప్రసంగాలు, నినాదాలు చేయడం, మద్యం తాగడం, జూదం ఆడటం చట్టవిరుద్ధమైన చర్యలు అన్నారు. ఏ ముఖ్యమైన ఘటనలు జరిగినాన తక్షణమే 100 ద్వారా డీఎస్పీ సెల్..94407 96860, సీఐ సెల్..94407 96861, ఎస్‌ఐ సెల్.. 94407 96863 నెంబర్లకు తెలియజేయాలని సూచించారు. ఈ సమావేశంలో సిఐ లక్ష్మీకాంతరెడ్డి ఎస్‌ఐ ధరణి బాబు పాల్గొన్నారు.
విలేకరులతో మాట్లాడుతున్న డీఎస్పీ గంగయ్య










