గంథమహోత్సవ పోస్టర్ ఆవిష్కరణ
ప్రజాశక్తి-మర్రిపాడు : పవిత్ర పుణ్య క్షేత్రమైన ఎఎస్‌పేట దర్గాలో అక్టోబర్ 11న జరిగే 250వ ఉరుసు గంథమహోత్సవ గోడ పత్రికను బ్రాహ్మణపల్లిలోని ఎంఎల్‌ఎ నివాసంలో ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ ఈ గంథమహోత్సవానికి అనేక రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారని తెలిపారు. వారికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసేందుకు ముందుగానే సమీక్షలు నిర్వహించుకుని, ఎవరు ఏ పనులు చేయాలో ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని వారికి సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతి, నీరు, ట్రాఫిక్, విద్యుత్, పారిశుధ్యం తదితర అంశాలపై ముందుగానే ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలన్నారు. దానిపై తామందరం కలసి సమీక్ష నిర్వహించుకుందామని వారికి సూచించారు. కార్యక్రమంలో దర్గా ఇఒ, ముస్లిం మైనారిటీ నాయకులు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.










