ప్రజాశక్తి-కందుకూరు :పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న వారితో పాటు వినియోగిస్తున్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు కందుకూరు డిఎస్‌ఫి రామచంద్ర చెప్పారు. బుధవారం కందుకూరు పట్టణంలోని క్లబ్ రోడ్డులో బుధవారం కుంచాల శీను కు చెందిన ప్లాట్ వద్ద ఐదుగురు గంజాయి విక్రయించేవారితోపాటు తాగే వారు ఉన్నారని సమాచారం రావడంతో కందుకూరు సిఐ నఫీజ్ బాషా, ఎస్‌ఐ హనీఫ్ తన సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లి వారిని పట్టకున్నారు. అనంతరం డిఎస్‌పి విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పట్టుబడ్డ వారికి వైజాగ్‌కు చెందిన రాము అనే వ్యక్తి గంజాయి సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలిందని తెలిపారు. అరెస్టు చేసిన ఐదుగురు వ్యక్తులు వద్ద ఒక కేజీ 600 గ్రాముల గంజాయి స్వాధీనం చేసు కున్నట్లు తెలిపారు. పట్టుబడిన ఐదుగురు వ్యక్తులను రిమాండ్ కు పంపి స్తున్నట్లు డిఎస్పి రామచంద్ర తెలిపారు. విలేకర్ల సమావేశంలో సిఐ నఫీజ్ బాషా, ఎస్సై హనీఫ్ పాల్గొన్నారు.










