ప్రజాశక్తి-పుత్తూరుటౌన్:
గంజాయి మాఫియాను అరికట్టాడాకి జిల్లా ఎస్పి సెంథిల్ కుమార్ ఉత్తర్వుల మేరకు గత నెల నుండి మాదకద్రవ్యాలపై నిఘా వేసి వేశామని సెబ్ జేడి విద్యాసాగర్ నాయుడు అన్నారు. విక్రయానికి ఉంచిన 2 కేజీల 800 గ్రాములు, దాదాపుగా 90 లక్షలు విలువ గల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. అరెస్ట్ అయిన చిన్నబాబు ఒజికుప్పం, మహేష్ నగిరి, మూర్తి గెట్ పుత్తూరు, దీప ఓజికుప్పం, ఎస్‌ఎస్ చిట్టి ఓజి కుప్పం, రమణ ఓజికుప్పం, పి.తిరుమల ఓజికుప్పం, ఎమ్. ఆనంద్ కేఎన్‌రోడ్ పుత్తూరు, జి.షణ్ముగం గెట్‌పుత్తూరు, జి.సాయికుమార్ వడమాలపేట మండలంకు చెందిన వీరిని పుత్తూరు వెంకట పెరుమాల్ ఇంజనీరింగ్ కాలేజ్ కళాశాల, పుత్తూరు ఎస్‌ఆర్‌ఎస్ ప్రభుత్వం డిగ్రీ కళాశాల గ్రౌండ్ సమీపంలో అనుమానంగా కనబడడంతో విచారించగా గుట్టురట్టైందని పోలీసులు తెలిపారు. గంజాయితో యువత భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారుతోందని తల్లిదండ్రులు పిల్లలపై నిఘా పెట్టాలన్నారు. గంజాయి ముద్దాయిలను రిమాండ్‌కు తరలించినట్టుగా పోలీసులు తెలిపారు. అనంతరం పోలీసు సిబ్బందికి రివార్డులు ప్రకటించి వారికందించారు. పుత్తూరు సీఐ వెంకట్రామిరెడ్డి రెడ్డి, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, వివిధ మండలాల సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.










