Sep 25,2023 00:19

గంజాయి అక్రమ రవాణా పట్టివేత


గంజాయి అక్రమ రవాణా పట్టివేత
ముగ్గురి అరెస్టు
ప్రజాశక్తి -చిత్తూరు అర్బన్‌: జిల్లా ఎస్‌పి రిశాంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు చిత్తూర్‌ డిఎస్‌పి శ్రీనివాస మూర్తి పర్యవేక్షణలో సిఐ విశ్వనాధ రెడ్డి, ప్రసాద్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ , సిబ్బంది ముందస్తు సమాచారం మేరకు కట్టమంచి పరిసర ప్రాంతాలలో దాడులు నిర్వహించి చిత్తూరుకు చెందిన మురుగన్‌, వెంకటేష్‌, ఉమాపతి అనే ముగ్గురు వ్యక్తుల నుంచి అక్రమంగా గంజాయి వ్యాపారం చేస్తుండ సుమారు రెండు లక్షలు విలువ చేయు గంజాయి తో పాటూ ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను డిఎసపి శ్రీనివాస్‌ మీడియాకు చూపించారు. డిఎస్‌పిి మాట్లాడుతూ ఇక పై దాడులు కొనసాగుతాయని, ఎంతటి వారైనా అరెస్టు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.