Aug 15,2023 23:08

గంగజాతరను వైభవంగా జరుపుకుందాం
ప్రజాశక్తి-నగరి: గంగజాతరను వైభవంగా జరుపుకుం దామని జాతర నిర్వాహకులు తెలిపారు. మంగళ వారం స్థానిక కరకంఠేశ్వర స్వామి ఆలయంలో గంగ జాతర నిర్వహణపై గ్రామ సభ నిర్వహించారు. గత ఏడాది జాతర నిర్వహణకు సంబంధిత జమా ఖర్చుల వివరాలను వివరిస్తూ గత ఏడాది నిల్వ ఉన్న మొత్తము, అమ్మవారికి అందిన కానుకలు, దాతలు అందించిన సహకారాలను గ్రామ సభ దృష్ఠికి తెచ్చా రు. సెప్టెంబర్‌ 5వ తేదీన జాతర చాటింపు, 12, 13వ తేదీల్లో గంగజాతర నిర్వహిస్తామన్నారు. గ్రామ దేవత దేశమ్మ బ్రహ్మోత్సవాలను మంత్రి ఆర్కే రోజా టీటీడీ నుంచి పట్టువస్త్రాల సారెను ఇప్పించి చరిత్ర గుర్తుంచునే మహత్తరకార్యం చేశారంటూ జాతర పెద్ద లు కొనియాడారు. అనంతరం జాతర నిర్వాహకులు మాట్లా డుతూ గంగమ్మ దేవతకు కూడా టీటీడీ సారె ఇప్పించేందుకు జాతర పెద్దలు కలిసి మంత్రిని సంప్రదించి విన్నవించుకోవా లన్నారు. ప్రస్తుతం దేశమ్మ దేవాలయం నిర్మాణంలో ఉన్నం దున కుంభాభిషేకం జరగకుండా అమ్మవారిని తీసుకురాలే మని జాతరలోపు కుంభాభిషేకం జరగకుంటే జాతరలో గ్రా మదేవతల ఊరేగింపు విడిగా నిర్వహించుకోవాల్సి ఉంటుం దన్నారు. నగరి జాతర జిల్లా స్థాయిలో ప్రాచుర్యం సంపాదిం చుకుందని ఈ ఏడాది ఘనంగా నిర్వహించుకుందామన్నారు. గ్రామ ప్రజల సంక్షేమం కోసం జరిపే జాతరను అందరూ కలిసి కట్టుగా ఉండి నిర్వహించుకుందామని దీనికి అందరూ సహకరించాలన్నారు. నిర్వహణకు సంబంధిత సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. తనవంతుగా రూ.లక్ష విరాళం అందిస్తానని చలపతి ప్రకటించారు. కార్యక్రమంలో జాతర పెద్దలు జ్యోతి రెడ్డి, ఆనం సురేష్‌, రాధాకృష్ణన్‌, దయానిధి, కృ ష్ణారెడ్డి, గుణశేఖర్‌, మణి, ఆర్‌.బాబు, బాబు రెడ్డి, రామ మూర్తి యాదవ్‌, శ్రీనివాసన్‌, ఇంద్రయ్య, హరి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.