హరికృష్ణ మృతదేహం
గల్లంతైన వ్యక్తి మృతదేహం వెలికితీత
ప్రజాశక్తి-కోవూరు :తన ఇద్దరు స్నేహితులతో కలిసి పెన్నానదిలో సరదాగా ఈత ఆడేందుకు వచ్చిన వ్యక్తి ప్రమాదవశాత్తు నదిలోని సుడిగుండంలో కొట్టుకొనిపోయాడు. గల్లంతైన సంఘటన మండలంలోని పోతిరెడ్డిపాళెం వద్ద శుక్రవారం చోటుచేసుకున్న సంఘటన విధితమే. నెల్లూరు నగరంలోని బాలాజి నగర్‌కు చెందిన పి. హరికష్ణ(42) ఇద్దరు స్నేహితులతో కలిసి పెన్నానదిలో ఈత కొడుతూ గల్లంతైనాడు. శనివారం గజ ఈతగాళ్లు, బోటు సహాయంతో మృతదేహాన్ని వెలికి తీసినట్లు ఎస్‌ఐ రంగనాధ్‌గౌడ్ తెలిపారు. మృతదేహాన్ని కోవూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి పంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి
పోతిరెడ్డిపాళెం వద్ద ఉన్న పెన్నా నది వద్ద కొన్ని ప్రాంతాల్లో ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను స్థానికులు కోరారు.పోతిరెడ్డిపాళెం వద్ద ఉన్న శ్మశాన రోడ్డు, ఇటీవల పెన్నా ఒడ్డున నిర్మించిన శివాలయం వద్ద ఉన్న చోట్ల ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి.










