Sep 06,2022 23:39

గజవాహనం పై గణనాధుడు
ప్రజాశక్తి- ఐరాల:
కాణిపాకం స్వయంభూ శ్రీవరసిద్ధి వినాయకస్వామి వారి దేవస్థానంలో ఆగస్టు 31నుంచి సెప్టెంబర్‌ 20వ తేదీ వరకు 21 రోజులు పాటు అత్యంత వైభవంగా జరుగుతున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరోవ రోజైన మంగళవారం సిద్దిబుద్ది సమేతుడైన శ్రీవరసిద్ధి వినాయకస్వామివారి ఉత్సవ మూర్తులు వషభవాహనం ఊరేగుతూ భక్తులను అలరించారు. ఈసందర్భంగా ఆలయ వరుస ఉత్సవఉభయదార్లు అయిన కాణిపాకం, వన్నియ నాయకర్‌ వంశస్థులు, ఉదయం స్వామివారి మూల విరాట్‌కు వివిధ రకాల సుగంధ పరిమళద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామి వారి తీర్థప్రసాదాలు, పంచామతం పంచిపెట్టారు. అనంతరం రాత్రి వివిధ రకాల విదేశ పరిమళ పుష్పాలతో, రంగు రంగుల విద్యుత్‌ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన గజవాహనంపై సిద్ధిబుద్ది సమేతుడైనా శ్రీవరసిద్ది వినాయకస్వామివారి ఉత్సవమూర్తులను ఉంచి కాణిపాకం మాడవీధుల గుండా బాణాచంచాలు పేలుస్తూ మంగళవాయిద్యాలు నడుమా ఘనంగా ఊరేగించారు. ఈకార్యక్రమంలో ఆలయ ట్రస్టుబోర్డు ఛైర్మెన్‌, ఎ. మోహన్‌ రెడ్డి,ఆలయ ఈఓ యం.వి.సురేష్‌ బాబు, అద్వర్యంలోజరిగిన ఈకార్యక్రమంలో ఎసి కస్తూరి, ఎఈఓలు విద్యాసాగర్‌రెడ్డి, రవీంద్రబాబు, ఎస్వీ.కష్ణా రెడ్డి, హేమమాలిని, హరిమాధవరెడ్డి, సూపరింటెండెంట్లు వాసు, కోదండపాణి, శ్రీనివాసులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌లు రమేష్‌, బాబు, ప్రధాన అర్చకులు ధర్మేశ్వర్‌ గురుకుల్‌, అర్చకులు, ఎస్‌ఎస్‌ గణేష్‌ గురుకుల్‌, ఎస్‌ఎస్‌ బాలసుబ్రమణ్యం, ఆర్‌వై.రాఘవేంద్ర, డి.శివకుమార్‌, వేదపండితులతోపాటు ఆలయ ఉభయదార్లు, వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు, పాల్గొన్నారు.
రధోత్సవానికి ఏర్పాట్లు సర్వం సిద్ధం
కాణిపాకం స్వయంభూ శ్రీవరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం జరిగేస్వామి వారి రధోత్సవానికి ఏర్పాట్లు సర్వంసిద్ధం చేసినట్లు ఆలయ ఈఓ యంవి.సురేష్‌ బాబు ఆలయ ట్రస్టుబోర్డు ఛైర్మెన్‌ ఎ.మోహన్‌రెడ్డిలు తెలిపారు. రధోత్సవం సందర్భంగా రథానికి ఆలయ అర్చకులు, వేదపండితులచే సాయంత్రం విఘ్నేశ్వర పూజ, పుణ్యవచనం వంటి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందసన్నారు. రథ కళశ అభిషేకం, రథసారధి గొడుగులకు సంప్రోక్షణ నిర్వహించినట్లు పేర్కొన్నారు. తరువాత కళాశాలను, గొడుగులు, కాణిపాకం మాడ వీధుల గుండా ఊరేగించారు. తరువాత కుష్మాండ బలి చేసి రథ కళశ ప్రతిష్ట నిర్వహించడం జరిగిందన్నారు. దీంతో రథోత్సవానికి ముక్కోటి దేవతలను ఆహ్వానించారన్నారు. స్వామివారి రథోత్సవానికి మన రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తెలంగాణా, వంటి పొరుగు రాష్ట్రాల నుంచి సుమారు లక్షమంది పైగా భక్తులు తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచానా వేస్తున్నట్లు తెలిపారు. బుధవారం జరిగే స్వామివారి రథోత్సవం ముందు ఉదయం 9గంటల నుంచే కీలు గుర్రాలు, పగటి విచిత్ర వేషాలు, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, కోలాటాలు, చెక్కభజనలు, వివిధ రకాల సాంస్కతిక కార్యక్రమాలతో పాటు, అశ్వ, గజ, వషభ, ఒంటెలు, వంటి పదాది దళంతో పాటు ఆలయ సైన్యంతో అత్యంత వైభంగా నిర్వహించడానికి ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామని వివరించారు.