Jul 30,2022 21:23

గిరిజనుల గృహానిర్మాణాలకు అటవీ శాఖ సహకరించాలి
రాష్ట్ర ఎస్టీ కమీషన్‌ సభ్యులు వడిత్యా శంకర్‌ నాయక్‌
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌:
కుయ్యవంకలో ప్రభుత్వం ద్వారా గహాలు నిర్మించుకుంటున్న గిరినజలకు అటవీశాఖ అధికారులు సహకరించాలిని రాష్ట్ర ఎస్టీ కమీషన్‌ సభ్యులు వడిత్యా శంఖర్‌ నాయక్‌ పేర్కొన్నారు. శనివారం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఏ.మూర్తితో కలసి తవణంపల్లి మండలం, మాధవరం పంచాయతీ, కుయ్యవంక గిరిజన కాలనీలో ప్రభుత్వం మంజూరు చేసిన గహనిర్మాణాలపై అటవీశాఖ అధికారులు అభ్యంతరాలు చేయడంతో గహనిర్మాణాల లబ్దిదారులతో కలసి పరిశీలించారు. అనంతరం మండలస్థాయి అధికారులు, గిరిజనులతో కుయ్యవంక గిరిజనకాలనీకి సంబంధించిన సమస్యలపై సమీక్షించారు. ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు, ప్రభుత్వం మంజూరు చేసిన గహాలు నిర్మించుకొనుటకు అటవీ అధికారుల నుండి అనుమతులు, ప్రాథమిక పాఠశాల, మాధవరం నుండి కుయ్యవంక గిరిజన కాలానికి రోడ్డు సౌకర్యం, ఓవర్‌ హెడ్‌ట్యాంక్‌ మంజూరు చేయించాలని కమీషన్‌ సభ్యునికి గిరిజనులు తెలియజేసారు. ఈ సందర్భంగా కమీషన్‌ సభ్యులు శంకర్‌నాయక్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోనే పేద గిరిజనులందరికీ రాజ్యాంగం కల్పించిన ఫలాలు అందాలని, సమాజంలో గిరిజనులు కూడా అభివద్ధి చెందాలని రాజ్యాంగబద్ధమైన హక్కులు వారిద్దరికీ చేరాలన్న సంకల్పంతో రాష్ట్రంలో ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు చేయడం నిర్మించబడిందని తెలిపారు. గిరిజనులు సమాజంలో ఆర్థికంగా విద్య, ఉద్యోగాల హక్కులను గిరిజనులు పొందాలన్నదే ఈ కమిషన్‌ యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన గిరిజనులకు మంజూరు చేసిన గహాలనిర్మాణాలను అటవీశాఖ అధికారులు అడుకోవడం పై అటవీ అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ గిరిజనులు సుమారు 50సంవత్సరాలగా నివసిస్తున్నారని, వీరు అడవికి సంబంధించి ఏమైనా నష్ట కలిగిస్తున్నారా, అమాయులైన గిరిజలపై అటవీ శాఖ అధికారులు దౌర్జన్యలు చేస్తే ఎస్టీ కమీషన్‌ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. గిరిజనుల గహాలు నిర్మించుకునేలా సహకరించాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే ఈ కాలనీకి మంజూరు చేసిన 18 గహాలకు సంబంధించి మీరు చెప్పిన సమస్యలు జిల్లా కలెక్టరుతో కూడా చర్చించి అటవీశాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కలెక్టర్‌ని కోరడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో గంగవరం, తవనపల్లి మండల తహశీల్దార్లు మురళి, జయంతి, తవణంపల్లి ఎంపిడిఓ హరిప్రసాద్‌, అటవీ, పోలీసు, రెవెన్యూశాఖల మండల స్థాయి అధికారులు, సర్పంచ్‌ రవీంద్ర బాబు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.