Mar 02,2022 19:39

మాట్లాడుతున్న హరిచౌహాన్‌ నాయక్‌.



బుధవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో హరిచౌహాన్‌ నాయక్‌ మాట్లాడుతూ బంజారా జన్‌ సంఫ్‌ు ఆధ్వర్యంలో ఈ నెల 5, 6 తేదీల్లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోఁ శ్రీఁవాస ఆడిటోరియంలో గిరిజన ప్రతిభా పురస్కార అవార్డులు, సాంస్కృతిక మహోత్సవాలను, గిరిజన ఆత్మ గౌరవ సభను ఁర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాఁకి ప్రజా ప్రతిఁధులు, ఎస్టీ కమీషన్‌ ట్రైకార్‌ ఛైర్మన్‌, నాయకఁలు హాజరౌతున్నారన్నారు. గిరిజన సంస్కృతికి అద్దంపట్టే కళా ప్రదర్శనలు చేయనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాల్య వెంకటేష్‌ నాయక్‌, చంధ్రశేఖర్‌ నాయక్‌, వాణి, సౌంధర్‌ నాయక్‌, శ్రీను, చంద్ర నాయక్‌, పావణి తదితరులు పాల్గొన్నారు.