Sep 12,2023 09:11

అర్జీలను స్వీకరిస్తున్న కలెక్టర్‌ ఎం.గౌతమి

          అనంతపురం కలెక్టరేట్‌ : జగనన్నకు చెబుదాం, స్పందన గ్రీవెన్స్‌లను పరిష్కారంపై ప్రత్యేక దష్టి సారించి, గడువులోపు వాటికి పరిష్కారం చూపాలని కలెక్టర్‌ ఎం.గౌతమి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాం, స్పందన గ్రీవెన్స్‌ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి జిల్లా కలెక్టర్‌ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం, స్పందన గ్రీవెన్స్‌లను గడువు తీరకముందే పరిష్కరించాలన్నారు. గ్రీవెన్స్‌ బియాండ్‌ ఎస్‌ఎల్‌ఎలోకి రాకుండా చూసుకోవాలన్నారు. అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపించాలని, అర్జీదారులతో మాట్లాడి సంతప్తి చెందేలా పరిష్కారం చూపించాలని ఆదేశించారు. పెండింగ్‌ ఉన్న అర్జీలను ఆలస్యం చేయకుండా పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రీవెన్స్‌ రీఓపెన్‌ కాకుండా చూసుకోవాలన్నారు. జగనన్నకు చెబుదాం గ్రీవెన్స్‌ ఎలా పరిష్కరించాలి, ఎండార్స్మెంట్‌ ఏ విధంగా ఇవ్వాలి, తదితర అంశాలపై సోమ, మంగళవారాల్లో డివిజన్‌ వారిగా శిక్షణ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌, డిఆర్‌ఒ గాయత్రీ దేవి, ఆర్డీవో మధుసూదన్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ శ్రీనివాసులు డీఆర్డీఏ పీడీ నరసింహారెడ్డి, పిఆర్‌ ఎస్‌ఈ భాగ్యరాజ్‌, ఆర్‌అండ్‌ బి ఎస్‌ఈ ఓబుల్‌ రెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్‌ ఎస్‌ఈ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.