May 17,2023 21:09

ప్రజాశక్తి - పాలకోడేరు

గడపగడపకూ వెళ్తున్న సందర్భంలో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, రాబోయే ఎన్నికల్లో అధిక మెజార్టీతో ఉండి నియోజకవర్గంలో వైసిపి జెండా ఎగరేస్తామని డిసిసిబి ఛైౖర్మన్‌ పివిఎల్‌ నరసింహరాజు అన్నారు. వేండ్రలో మండల పరిషత్‌ అధ్యక్షులు భూపతిరాజు సత్యనారాయణరాజు (చంటి రాక్ష్మి) ఆధ్వర్యంలో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా చంటిరాజుతో పాటు పివిఎల్‌ గ్రామంలో ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమం, అభివృద్ధిని గ్రామస్తులకు వివరించారు. ఈ సందర్భంగా పివిఎల్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలు కూడా అమలు చేశారన్నారు. ఎంపిపి చంటిరాజు మాట్లాడుతూ సంక్షేమ పథకాలు తమను గెలిపిస్తాయని పూర్తి నమ్మకం ఉందన్నారు. రాబోయే రోజుల్లో నరసింహరాజు ఎంఎల్‌ఎగా గెలుపొందే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచి కడలి నాగేశ్వరి, ఉపసర్పంచి భూపతిరాజు, సుబ్బరాజు, నాయకులు వర్మ, దవాలా కె.వెంకటేశ్వరరావు, సానబోయిన వేణు, వేగి రమణ, నేలపాటి రాజబాబు, బి.నాగరాజు, వీరబాబు, వెంకటేశ్వరరావు, దేవరాజు, జాన్‌, రాంబాబు, పాపారావు, బొల్లా శ్రీనివాస్‌, నరేష్‌, తహశీల్దార్‌ షేక్‌ హుస్సేన్‌, ఎంపిడిఒ మురళీ గంగాధర్‌, ఆర్‌ఐ నాగభూషణరావు, విఆర్‌ఒ అలేఖ్య గ్రామస్తులు పాల్గొన్నారు.